తలుపులు మూసేసి బిల్లు ఆమోదింపజేశారు: సీఎం రమేశ్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన రాజకీయ కోణంలో జరుగుతోందనే విభజనను వ్యతిరేకించామని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌ రాజ్యసభలో తెలిపారు. విభజన జరిగిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. ఆనాడు లోక్‌సభ తలుపులు మూసివేసి చర్చ లేకుండా బిల్లు ఆమోదించారని గుర్తు చేశారు. బిల్లులో తప్పులున్నాయని చెప్పినా యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీయేనని.. వారు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వద్దకు వెళ్లి ప్రత్యేక హోదాకు ఒప్పుకుంటేను మద్దతిస్తామన్నారని గుర్తు చేశారు.