తల్లిదండ్రులు గర్వించేలా ఎదగాలి. ప్రిన్సిపాల్ ఎస్.విధ్యారాణి.

పాలెం డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగత కార్యక్రమం.
బిజినపల్లి,జనంసాక్షి:
విద్యార్థులు తమ తల్లిదండ్రులు గర్వపడేలా క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.విద్యారాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు.శుక్రవారం బిజినపల్లి మండలం పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నూతన విద్యార్థులకు తృతీయ సంవత్సర విద్యార్థులు స్వాగత కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ఎస్.విధ్యారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత లక్ష్యం చేరుకోవడా నికి చదువుకునే మార్గంలో ఎన్నో అవతారాలు ఎదురవుతుంటాయని వాటన్నింటినీ ఎదుర్కోవాలని అన్నారు. కళాశాలలో చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ పవర్, ఎన్.ఎస్.ఎస్, యోగా వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. కళాశాల అభివృద్ధికి విద్యార్థుల ప్రతిభనే మూలమని,విద్యార్థుల ప్రవర్తన వ్యక్తిత్వంను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మంచి భవిష్యత్తుకై అనునిత్యం ప్రయత్నం చేయాలని సూచించారు.తరగతి గదులలో పాఠ్యాంశాలు బోధించే అధ్యాపకులను కేవలం విద్యకేకాక వారితో వ్యక్తిగత సమస్యలను కూడా పంచుకొని పరిష్కార మార్గాలను తెలుసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఎంచుకున్న మార్గాలు తల్లిదండ్రులు అధ్యాపకులు మరియు సమాజం గర్వపడేలా ఉండాలని అన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా తగు సూచనలు సలహాలు క్రమశిక్షణను నేర్పుతూ సోదర సోదరీ భావంతో నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం సుష్మ, నాగరాజు,శివ,రాధాకుమారి, స్వప్న, నాగలింగం,రామకృష్ణ,రవికుమార్ రమేష్ ప్రవళిత,కృష్ణ తేజ, మనోజ్,హమీద్ మహేశ్వర్ జి,యాదగిరి, అధ్యాపకేతర బృందం యాదగిరి, కురుమయ్య, బాలస్వామి,అక్బర్,గణేష్,నాగేష్,మాసూం, ప్రథమ,ద్వితీయ,తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.