తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం

పామూరు , జూలై 26 : తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం అని బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు షేక్‌ రమీజాబి, డి రామసుబ్బులు, డి ఝాన్సీభాయిలు పేర్కొన్నారు. పట్టణంలోని గనెంకులవారిపాలెం, కరెంటు ఆఫీసు వెనుక బిసి కాలనీ, విరాట్‌నగర్‌ కాలనీల్లో మాతా శిశు ఛైతన్య కార్యక్రమాలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు పౌష్టికాహారంను క్రమం తప్పకుండా తీసుకోవాలని అన్నారు. తల్లులకు శిశు చైతన్యం గురించి వివరించారు. కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారంను తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎంలు శ్రీదేవి, పి జ్యోతి, ఎం వరలక్ష్మి, ఆయాలు కొండమ్మ, శైలజ, షేక్‌ ఖాజాబి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.