తల్లి పరీక్ష హాల్లో.. పాప ఏసిపి చేతుల్లో..
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఆకారపు శరత్ చంద్రకా మెమోరియల్ మహిళ కళాశాలలో (ఏ ఎస్ ఎం) ఆదివారం గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా తన నెల రోజుల పాపను తీసుకొని పరీక్ష రాసేందుకు ఓ అభ్యర్థిని ఉదయం పరీక్ష కేంద్రానికి వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చిన వరంగల్ ఏసిపి కలకోట గిరి కుమార్ ఆ పసిపాపను చేతుల్లోకి తీసుకుని కాసేపు ఆడించిన దృశ్యం కనిపించింది. ఆ తర్వాత అక్కడే ఉన్న పాప సంబంధీకులకు అప్పగించారు. పోలీసులు తమ బాధ్యత గల వృత్తిలోనే కాకుండా ఇలాంటి సందర్భాలలో కూడా తగిన విధంగా స్పందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తుండడం ఎంతో ప్రశంసనీయం.
Attachments area