తాగిన గొడవలో వ్యక్తి హత్య
సిద్దిపేట,ఆగస్ట్13(జనం సాక్షి): గజ్వెల్ నియోజకవర్గం మర్కూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. సవిూపంలోని మామిడి తోటలో దారుణ హత్య జరిగింది. పక్కపక్కనే తోటలలో పని చేసే ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ అనే వ్యక్తులు మద్యం సేవిస్తూ ఒకరినొకరు దూషించుకున్నారు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో.. కోపంలో ప్రభాకర్ రెడ్డి గొడ్డలితో శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.