తాగుట్ల మనోళ్లు.. ఫస్ట్ ర్యాంక్ కొట్టిర్రు

ఆదాయంలో రికార్డులు సృష్టిస్తోంది రాష్ట్ర ఆబ్కారీ శాఖ. లక్ష్యాన్ని అధిగమించి ఆదాయాన్ని సాధించింది. 2016–17 సంవత్సరానికి ఆ శాఖ రూ. 13,200 కోట్లు ఆదాయ లక్ష్యంగా పెట్టుకోగా, దాన్ని అధిగమించి రూ. 14,100 కోట్లు వసూలు చేసింది. లక్ష్యం కంటే రూ.900 కోట్లు అధికంగా జమ చేసింది. ఇందులో ఎక్సైజ్ ఆదాయం రూ.5800 కోట్లు కాగా వ్యాట్ ఆదాయం రూ. 8,300 కోట్లుగా ఉంది. వాస్తవానికి 2016-17లో ఆదాయ టార్గెట్‌ను మొదట రూ.13,700 కోట్లుగా పెట్టుకున్నా తర్వాత దానిని రూ. 13,200 కోట్లకు సవరించుకున్నారు. 2.80 కోట్ల కేసుల(ఒక్కోకేసులో 9 లీటర్లు) లిక్కర్ అమ్మకాలు, అలాగే ఒక్కోదానిలో 8 లీటర్ల బీరు ఉండే 3.40 కోట్ల కేసుల విక్రయాలు జరిగాయి. కాగా 2017-18 సంవత్సరానికి రూ.20వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఎైక్సెజ్ ఆదాయం కింద రూ. 9 వేల కోట్లు, వ్యాట్ ఆదాయం కింద రూ.11వేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.