తాగునీటి సమస్య పరిష్కరించాలి

కర్నూలు,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా నీటి సరఫరా శాఖ కార్యాలయం వద్ద బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల 430 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. ఈ తాగునీటి సమస్యను తీర్చడానికి
అధికారులు విూనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. వేసవిలో తాగునీటి పరిష్కారం కోసం రూ. 50 కోట్లకు ప్రతిపాదనను పంపినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాగునీటి సరఫరా బకాయిలను విడుదల చేసి జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.