తాడ్వాయి ఎన్‌కౌంటర్ భూటకం
మైనింగ్ మాఫీయా కోసమే ఈ హత్యలు
శృతిపై అత్యాచారం
వరవరరావు
వరంగల్ సెప్టెంబర్16(జనంసాక్షి):
తాడ్వాయి ఎన్ కౌంటర్ బూటకం అని విప్లవ కవి వరవరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శృతిని లైంగికంగా హింసించి, యాసిడ్ పోసి పోలీసులు హతమార్చారని ఆయన ఆరోపించారు. మైనింగ్ మాఫియా కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు తరహాలో కేసీఆర్ రాజ్యహింసకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల కుటుంబాలను బుధవారం ఆయన పరామర్శించారు. వరంగల్‌జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో తంగెళ్ల శృతి(23) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్ రెడ్డి(27) అలియాస్ సాగర్ మృతి చెందారు. శ్రుతి హన్మకొండలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (ఈసీఈ) పూర్తిచేసి హైదరాబాద్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతోంది.పోస్టుమార్టం కోసం శవాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిబంధనల ప్రకారం శవ పరిక్షలు జరగడం లేదని కోర్టును ఆశ్రయించారు. నిబందనలకు లోబడ
పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది, అలాగే మృతుల శవాలను చూసేందుకు తల్లిదండ్రులను అనుమతించారు. ఎంజిఎం ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో విరసం సభ్యులు, విప్లవ అభిమానులు పోగయ్యారు. పోస్టు మార్టం అనంతరం శవాలను వారివారి స్వగ్రామలకు తరలించారు.