తాసిల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన వీఆర్ఏలు

 

కురవి అక్టోబర్-10 (జనం సాక్షి న్యూస్)

తాసిల్దార్ కార్యాలయానికి దిగ్బంధం చేసిన వీఆర్ఏలు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట
వీఆర్ఏల జేఏసీ 78వ రోజు నిరవధీక సమ్మెలో భాగంగా రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు ఉదయం 10-00 గంటల నుండీ మధ్యాహనము 12-30 గంటల వరకు తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతూ కార్యాలములోకీ ఏవ్వరు రాకుండా నిర్బంధము చేయడం జరిగింది.తహసీల్దార్ కార్యాలయములో విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బందిని, కురవి మండల తహశీల్దార్ యం ఇమ్మన్యుయేల్ ను అడ్డుకోవడం జరిగింది. వీఆర్ఏల యొక్క సమ్మె ప్రభావం రాష్ట ప్రభుత్వానీకీ తమ ద్వారా తేలీయజేయాలనీ కోరడం జరిగింది.ఈ కార్యక్రమనికి మద్దతుగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాజా మద్దతుగా పాల్గొని మాట్లాడుతూ నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన పే స్కేలు జీ.ఓ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ మొండీ వైకరీతో వీఆర్వో లను పూర్తీగా రేవేన్యూ నుండీ తోలగీంచీనదీ వీఆర్ఏలను కూడా తోలగించీ రేవేన్యూ వ్యవస్థ లేకుండా చేధ్ధామనే ధ్రృడసంకల్పముతో యున్న ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని మరియు విఆర్ఏ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వీఆర్ఏ జేఏసీ మద్దతుగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కురవి మండల విఆర్ఏ లు సరిత జ్యోష్ణ, సుజాత, వినయ్, ఉపేందర్, వెంకన్న ,వెంకటేష్ నగేష్ ,నాగరాజు, రమేష్ లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు