తీర్థాల జాతర సమీక్షా సమావేశం

ఖమ్మం గ్రామీణం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయంలో జరిగే జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఖమ్మం ఆర్టీవో వాసం వెంకటేశ్వర్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది జాతరలో సుమారు 2లక్షల మంది
భక్తులు పాల్గొన్నారని, వారికి సంబంధించిన ఏర్పాట్లలో లోటుపాట్లు జరిగాయని ఈ సారి ఆ లోటుపాట్లను అధిగమించి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బెల్టు షాపులను ఎత్తివేయాలని ఎక్సైజ్‌ వారికి అదేశించారు. ఆలయానికి సంబంధించిన ఆదాయ వ్యయాలలో అక్రమాలు జరిగాయని గ్రామస్థులు ఆరోపించిన నేపథ్యంలో దాని కోసం మార్చి 3న సమావేశం పెడతామన్నారు.