తుమ్మలపల్లి పాఠశాలలో నూతన దుస్తుల పంపిణీ

జనం సాక్షి,వంగూరు:
మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో శుక్రవారం యుపిఎస్ పాఠశాలలో సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన దుస్తులు పంపిణీ చేశారు. తదుపరి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు గ్రామీణ విద్యార్థులకు అందజేయడం కోసం ఎల్లప్పుడూ ముందుంటుందని కెసిఆర్ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ లకు దీటుగా అన్ని వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కూలలో ఉపాధ్యాయులు తగిన విద్యాహర్వతలు ఉండి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కనుక అదే ప్రైవేటు స్కూల్లో ఇంటర్, డిగ్రీ చదివి ఎలాంటి ట్రైనింగ్ లేని వారిని పెట్టి విద్యార్థులకు బోధిస్తారు అని తెలియజేశారు.గతంలో మాకు కూడా ఒక ప్రైవేట్ స్కూలు ఉంటే దానిని బంద్ చేసి ఆ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగిందని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజేందర్, పంచాయతీ సెక్రటరీ కృష్ణయ్య, గ్రామ పెద్దలు మదన్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ రఘుపతి రెడ్డి, లక్ష్మయ్య,  చంద్రయ్య, జలంధర్, ఉపాధ్యాయులు శ్రీధర్ , దస్రు , లక్ష్మీబాయి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.