తుమ్మల చేరితే కాంగ్రెస్ మరింత బలోపేతం
ఇప్పటికే పొంగులేటి రాకతో పెరిగిన జోష్
ఉమ్మడి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు కష్టమే అంటున్న నేతలు
ఖమ్మం,సెప్టెంబర్4 జనం సాక్షి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు మాజీమంత్రి తుమమల నాగేశ్వరరావు చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటి వరకు పొంగగులేటి, ఇప్పుడు తుమమల అన్నచందంగా రాజకీయ పరిణామాలు మారాయి. తుమ్మల దాదాపుగా బిఆర్‌ఎస్‌ను విడిపోయినట్లే అన్న ప్రచారం కూడా జోరందుకుంది. తుమ్మలను దగ్గరకు తీసుకోవాలని, ఓదార్చాలన్న ప్రయత్నాలు బిఆర్‌ఎస్ నుంచి కానారవడం లేదు. దీంతో ఆయన బిఆర్‌ఎస్‌ను వీడడం ఖాయమని అంటున్నారు. దీంతో ఖమ్మంలో ఇప్పుడు కాంగ్రెస్ మరింత బలోపేతం కానుందని అంటున్నారు. ఖమ్మంలో బిఆర్‌ఎస్‌కు పెద్దగా పట్టులేదు. పొంగులేటి తరవాత తుమ్మల చేరితే కాంగ్రెస్‌కు తిరుగు ఉండదన్న భావన వస్తోంది. బీఆర్‌ఎస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలు ఇటీవల హైదరాబాదులో తుమ్మల నివాసంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మరోసారి తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని వారికి చెప్పిన నేపథ్యంలో ముఖ్యనేతలతో సమావేశం కానున్న తుమ్మల
పార్టీమార్పుపై చర్చించనున్నారు. ఈనెల 6 లేదా 9వతేదీన ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తుమ్మల ఏం నిర్ణయం తీసుకోబుతున్నారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఉమ్మడిజిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన తుమ్మల వర్గీయులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తుమ్మల నిర్ణయమే తమ నిర్ణయమని, ఆయన ఏపార్టీలో చేరినా ఆయనతోపాటే తాముంటామంటూ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా తుమ్మల వెంట నడిచే అనుచరుల జాబితాలను ఆయన వర్గం నేతలు సిద్ధం చేస్తున్నారు. ఇక 40ఏళ్లుగా ఉమ్మడిజిల్లాలో తుమ్మల వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌కు బై చెప్పి తుమ్మల వెంట అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. తమ అధినాయకత్వం తుమ్మలను ఆహ్వానించిన క్రమంలో ఆయనేం నిర్ణయం తీసుకుం టారనే దానిపై ఎదురుచూస్తూన్న కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాకపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఆయన రాకతో తమ పార్టీ బలం మరింత పెరుగుతుందని తద్వారా ప్రత్యర్థిని సమర్థవంతంగా ఢీకొట్టొచ్చని హస్తం నేతలు భావిస్తున్నారు. వారిలో స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, సంస్థాగత నేతలు, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులంతా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటి వరకు బలహీనంగా ఉన్న టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లాలో బలమైన పార్టీగా ఎదిగింది. ఇప్పుడు తుమ్మల బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరితే బీఆర్‌ఎస్ ఓటుబ్యాంకుకు భారీగా గండిపడుతుందని, అదంతా కాంగ్రెస్‌కు లాభం చేకూరుస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ద్వారా కొంత ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు బలం కాగా.. తుమ్మల రాకతో ఆ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు బేరీజు వేసుకుంటున్నారు. మొత్తంగా మారుతున్న సవిూకరణాలతో ఖమ్మంలో బలమైన పార్టీగా కాంగ్రెస్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.