తుమ్మ జయసింహారెడ్డి జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి)

 

ఇటీవల రోడ్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడు తుమ్మ జయసింహ రెడ్డి  జ్ఞాపకార్థం  ఆదివారం వారి నివాసం ఎల్ బి నగర్ లో రెడ్ క్రోస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జయసింహ కుటుంబ సభ్యులతో పాటు  అతని క్లాస్ మేట్స్  రక్త దానం చేశారు .హెల్మెట్ ధరించండి  పుత్రశోకం మిగిల్చకండి ..ఎసిపి గిరి కుమార్…  యువత  హెల్మెట్ ధరించకుండా  మోటర్ సైకిల్ నడపడం వాళ్ళ  రోడ్ ప్రమాదాలు జరగడంతో ప్రాణాలు కోల్పోతున్నారని వరంగల్ ఎసిపి గిరి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల జయసింహ ప్రమాదానికి కేవలం హెల్మెట్  కారణమని అన్నారు ఈరోజు ఆకుటుంభం పడ్డ బాధ ఇంకో కుటుంభం పడకూడదని ఈ క్రొవ్వొత్తులతో ర్యాలీ చేశామని అన్నారు ఆదివారం సాయంత్రం వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్ లో  వారి కుటుంబ సభ్యులు  బంధు మిత్రులు  క్లాస్ మేట్స్ ..మిత్రులు  భారీ ర్యాలీగా క్రొవ్వొత్తులతో  నినాదాలు చేశారు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కోల్పోకండి… అతివేగం తో వెళ్ళకండి  పుత్రశోకం మిగిల్చకండి అంటూ నినాదాలు చేశారు…ఈ కార్యక్రమంలో  వరంగల్  ఏసీపీ గిరి కుమార్  మట్టేవాడ ఇన్స్పెక్టర్ రమేష్  కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు