తెగిపడ్డ విద్యుత్ వైరు… పాడి గేదె మృతి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు
 వరంగల్ బ్యూరో : అక్టోబర్ 7 ( జనం సాక్షి)
తెగిపడ్డ విద్యుత్తు వైర్లను తాకి పాడిగేదే మృత్యువాత పడింది ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామంలో జరుగగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితుని వివరాల ప్రకారం మందపల్లి గ్రామానికి చెందిన అంబరగొండ ఈశ్వరయ్య అనే వ్యక్తికి తనకు ఉన్న రెండు పాడి గేదేలను మేతకోసం వ్యవసాయ భూముల వద్దకు తీసుకెళ్లగా వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ వైర్లు తెగిపద్ద విషయాన్ని గమనించలేదని గేదలు మేత మేస్తున్న క్రమంలో తేగిపడ్డ విద్యుత్ వైర్లు రెండు పాడి గేదలకు ,బాధితుడు అంబరగొండ ఈశ్వరయ్యకు తగలడంతో ఒక గేద అక్కడికక్కడే మృతి చెందగా మరో గేదతో పాటు తనకు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు,తృటిలో రెండు నిండు ప్రాణాలకు ప్రమాదం తప్పిందని బోరున విలపించాడు. వ్యవసాయ బావులకు సంబంధించిన విద్యుత్ మోటర్ నడిచేందుకుగాను విద్యుత్ స్తంభాలు , వైర్లను సంబంధిత సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో నిర్మించి వెళ్ళారని ఆరోపించారు.ప్రజలు నివసించే ఇండ్ల ప్రాంతాల నుండి వ్యవసాయ బావులవద్ధకు విద్యుత్ లైన్ వైర్లను వేయడంవలన ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని దీంతో విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు తెలిపిన పట్టించుకోలేదని సంబంధిత కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు.పాడి గేదెలను పోషిస్తూ వాటి నుండి వచ్చే పాలు, పెరుగును అమ్ముకుంటూ జీవిస్తున్నామని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని సుమారు రూ. 35 వేలకుపైగా నష్టం జరిగిందని,ఈనష్టపరిహారాన్ని విద్యుత్ అధికారులు చెల్లించాలంటూ బాధితుని కుమారుడు అంబరగొండ దేవరాజ్ డిమాండ్ చేశారు.ఇప్పటికైనా విద్యుత్ ఉన్నత అధికారులు స్పందించి అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.