తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ
హైదరాబాద్, జనంసాక్షి: అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నాదేండ్ల మనోహర్ విచారణ ప్రారంభించారు. టీడీఎల్పీ విప్ ధళిపాళ్ల నరేంద్ర ఈ విచారణకు హాజరయ్యారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు.