తెరాసకు మద్దతు ఇవ్వడానికి తెదేపా సిద్ధం : ఎర్రబెల్లి
వరంగల్ : సహకార ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వడానికి తెదేపా సిద్ధంగా ఉందని ఆపార్టీ తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండటం వల్లే తెరాసకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన వరంగల్‌లో వెల్లడించారు.