తెరాసలోకి రానియ్యలే..

2

ఎర్రబెల్లిని నేనే అడ్డుకున్నా

ఉప ముఖ్యమంత్రి కడియం

హైదరాబాద్‌,మే 29(జనంసాక్షి):

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్‌ఎస్‌లోకి రాకుండా అడ్డుకున్నది తానేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో  చేరాలనుకున్న మాట వాస్తవమే అన్నారు. ఎర్రబెల్లిలాంటి తెలంగాణ ద్రోహులకు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎప్పటికీ స్థానం ఉండదని కడియం అన్నారు. టీఆర్‌ఎస్‌ ను విమర్శించే అర్హత ఎర్రబెల్లికి లేదన్నారు. తనను అడ్డ్‌ఉకున్నారనే అక్కసుతోనే తనపైనా, టిఆర్‌ఎస్‌పైనా తరచూ ఎర్రబెల్లి విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకుంటున్నానన్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పాలకుర్తిని ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఏడాదిలోగాచేసి చూపిస్తామన్నారు. ఎర్రబెల్లి బెదిరింపులకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారనేది ముఖ్యం కాదు, ముందు భాష మార్చుకోవాలని హితవు పలికారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. హుందాగా వ్యవహరించడం రాదన్నారు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా వివిధ శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను కోరారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఓరుగ్లులో ఘనంగా నిర్వహించబోతున్నామని అన్నారు. వీటి నిర్వహణపై జిల్లా యంత్రాంగం రూపొందించిన వారం రోజుల కార్యక్రమాలను  సవిూక్షించినట్లు చెప్‌ఆపరు. ఇందులో భాగంగా కలెక్టర్‌ బంగ్లా నుంచి కాళోజీ విగ్రహం వరకు కార్నివాల్‌గా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను వేయిస్తంభాల దేవాలయం వద్ద ఏర్పాటుచేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలపై రూపొందించిన లోగోను ప్లెక్సీలు, బ్యానర్లుగా తయారుచేసి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద అంటించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులపై కూడా అంటించాలని ఆర్టీసీ ఆర్‌ఎంకు సూచించామన్నారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలైన తంగేడు పువ్వు, పాలపిట్ట లాంటివాటికి విస్తృత ప్రచారం కల్పించబోతున్నామని చెప్పారు.