తెరాస రాస్తారోకో

ఇంద్రవెల్లి: బయ్యారం గనులు తెలంగాణకే చెందాలంటూ మండల కేంద్రంలో తెరాస ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో తెరాస ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కనక లక్కారావు పాల్గొని మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని బయ్యారం గనులను ఆంధ్రాకు తరలించడం అన్యాయమన్నారు. తెలంగాణకే బయ్యారం గనులు చెందే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ రాస్తారోకోలో నాయకులు శ్రీనివాస్‌, రాందాన్‌, అమ్జద్‌ తదితరులు పాల్గొన్నారు.