తెరాస వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

ఏ ఒక్క హావిూని నెరవేర్చని అధికార పార్టీ నేతలు

రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్‌ కూటమిదే: ఏలేటి

నిర్మల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని నిర్మల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన

హావిూలను తుంగలో తొక్కారని అన్నారు. వినీతి, అహంకారానికి తెరాస ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే గోబెల్స్‌ ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రచారంలో ఎక్కడిక్కడ వివరాలను వెల్లడిస్తున్నామని లిపారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసమే కాంగ్రెస్‌ పోరాటాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల

వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. కేసీఆర్‌ పాలన నియంతృత్వం ట్రేడ్‌మార్క్‌లా మారిందని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని నిస్సిగ్గుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని, ఇటీవల జరిగిన రైతుల ఆత్మహత్యలు విూ పాలనలో కాదా ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందని మండిపడ్డారు. బీజేపీ తమవి గొప్ప సిద్ధాంతాలంటూ ప్రతి ఇల్లు తిరుగుతూ కాంగ్రెస్‌ నేతలను ప్రలోభపెడుతుందన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరడం లేదని… కాంగ్రెస్‌ పార్టీలో చేరతామంటూ బీజేపీ సీనియర్లే తమను సంప్రదిస్తున్నారని అన్నారు.అభివృద్ధి, సంక్షేమాన్ని తెరాస, పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దిన్‌ ఓవైసీ చేసిన ఆరోపణలపై ఇప్పటికే తాను సమాధానం ఇవ్వడం జరిగిందన్నారు. మైనార్టీలను ఓట్లు అడిగే స్థితిలో వారు లేరని, తాను మాత్రం ఇక్కడి స్థానిక నాయకులతో కలిసి వెళ్లి ప్రచారం చేస్తున్నానని పేర్కొన్నారు. మంత్రిగా ఏ ఒక్క అభివృద్ధి, సంక్షేమం చేపట్టలేదని, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, ఇలా అన్ని విషయాల్లోనూ విఫలమయ్యారని, ప్రజలను పట్టించుకోకుండా పాలన చేపట్టి ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు తనిఖీలు చేపడుతున్నారని, అధికారులు సైతం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎంతటి బెదిరింపులకు గురి చేసినా వెనుకడుగు వేసేది లేదని, ప్రజాబలమే తమ ధైర్యమని, ప్రజలు పార్టీ వెన్నంటే ఉన్నారని రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.