తెలంగాణకు ఐపీఎస్‌ అధికారులను పెంచండి

5

– పలు సమస్యలపై రాజ్‌నాథ్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 13(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు శనివారం కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో

సమావేశమయ్యారు. విభజన చట్టంలోని  పెండింగ్‌ అంశాలు, ఐపీఎస్‌ అధికారుల కోటా పెంపు అంశాల గురించి రాజ్‌నాథ్‌తో చర్చించారు. కేసీఆర్‌ వెంట ఎంపీలు కేశవరావు,

జితేందర్‌ రెడ్డి, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులు ఉన్నారు.ఈ రోజు సాయంత్రం కేసీఆర్‌ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌తో భేటీ కానున్నారు.

హైకోర్టు విభజన అంశం గురించి  చర్చించనున్నారు. నిన్న ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానిని కోరారు.

కేంద్ర ¬ంమంత్రితో సీఎం కేసీఆర్‌ భేటీ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తెస్తూ లేఖలు సమర్పించారు. నగర ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణలో పోలీసు సేవలను విస్తృత పరచాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రానికి కేటాయించే ఐపిఎస్‌ అధికారుల సంఖ్యను 141 కి పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. గోదావరి, ప్రాణహిత నదుల వెంట ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ద్వారా 330 కిలోవిూటర్ల రహదారిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి సంబంధించిన పర్యావరణ, ఇతర అనుమతులు త్వరగా ఇప్పించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్‌.ఠాకూర్‌ ని కలిశారు. హైకోర్టు విభజనపై చర్చించారు. రాష్ట్ర విభజన జరిగి 20 నెలలైనా, పునర్విభజన చట్టంలో పేర్కొన్నా ఏపీకి ఇంతవరకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడం లేదని సీజే దృష్టికి తీసుకొచ్చారు. ఏపీకి త్వరగా హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రి జగదీష్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, జితె?ందర్‌ రెడ్డి, వినోద్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, డీజీపీ అనురాగ్‌ శర్మ తదితరులున్నారు.

‘తెలంగాణకు ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలి’

తెలంగాణకు ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం కేసీఆర్‌ కోరారని న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్‌ వేణుగోపాలచారి

వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఎస్‌ వేణుగోపాలచారి విలేకర్లతో మాట్లాడుతూ… విభజన చట్టం

మేరకు అసెంబ్లీ సీట్లను పెంచాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారని చెప్పారు. అలాగే ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని ఆయన్ని కేసీఆర్‌ కోరారని తెలిపారు. అన్ని విషయాలకు రాజ్‌నాథ్‌సింగ్‌ సానుకూలంగా స్పందించారని వేణుగోపాలచారి పేర్కొన్నారు.