తెలంగాణకు జైకొట్టే పార్టీలను, సంస్థలను

జేఏసీలో చేర్చుకొనే విషయం చర్చిస్తాం
జేఏసీ చైర్మన్‌ కోదండరాం
ఖమ్మం, సెప్టెంబర్‌7(జనంసాక్షి): తెలంగాణకు జైకొట్టే పార్టీలను జేఏసీలో చేర్చుకొనే విషయం ఆలోచిస్తామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం పనిచేస్తున్న పొలిటికల్‌ జేఏసీ లోకి తెలంగాణ సాధన కోరుకొనే ఇతర పార్టీలు, సంస్థలను చేర్చుకొనేందుకు వారితో చర్చిస్తామన్న ఆయన ఇప్పటికే తెలంగాణ లోక ్‌సత్తా, ప్రజాఫ్రంట్‌ నేతలతో చర్చలు మొదల య్యాయన్నారు. తెలంగాణ సాధన కోరుకొనే ఇతర పార్టీలతోనూ చర్చిస్తామన్నారు. సకల జనుల సమ్మె గత సంవత్సరం సెప్టెంబర్‌13న మొదలయినందును ఆ నేపధ్యాన్ని పురస్కరిం చుకొని తెలంగాణ పునరంకిత దీక్షలను గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రారంభించడం జరుగు తందన్నారు. ఈ నెలా ఖరున హైద్రాబాద్‌లో జరిగే మిలియన్‌ మార్చ్‌ ద్వారా తెలంగాణ సాధన ఉద్యమం మరింత ఉధృతం కాబోతుందని, ప్రతి ఇంటికి ఒక వ్యక్తి ఈ ఉద్యమంలో పాల్గొనేలా జేఏసీ ప్రయత్నిస్తుందన్నారు. విలేఖరుల సమావేశంలో జేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, వెంకటపతి రాజు, న్యాయవాది తిరుమలరావు, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు తిరుమలరావు, గంగవరపు నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.