తెలంగాణకు భయపడి గాలి మార్గంలో ప్రధాని పర్యటన

రోడ్డు మార్గంలో భద్రతపై ఇంటెలిజన్స్‌ అనుమానాలు
ట్రాఫిక్‌ ఆంక్షలు, బారికేడ్లతో తెలంగాణవాదుల్ని ఆపలేమన్న నిఘా వర్గాలు
ఆకాశంలోనూ నిరసన తెలుపుతాం
హైదరాబాద్‌లో నల్ల బెలూన్లు ఎగురవేయండి
వీలైన చోట్ల నల్ల జెండాలను ఎగురవేయండి..
తెలంగాణవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించండి
నవంబర్‌ 1న మరో సంగ్రామానికి సిద్ధం కండి
అక్టోబర్‌ 15 (జనంసాక్షి) :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనడానికి వస్తున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాకుండా గాలి మార్గంలో వెళ్లనున్నారు. ముందు రోడ్డు మార్గంలోనే రావాలని భావించిన ప్రధాని, తెలంగాణ వాదుల నుంచి నిరసనలు ఎదురవుతాయనే వాయు మార్గం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్‌ ఆంక్షలు, బ్యారికేడ్లు తెలంగాణవాదులను ఆపలేవని ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పష్టం చేయడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక వేళ తెలంగాణవాదులు ప్రధానిని అడ్డుకుంటే, అది అంతర్జాతీయ వార్తగా వెలువడుతుందని, దీన్ని అడ్డుకోవడానికి ప్రధాని పర్యటన మొత్తం వాయు మార్గాన జరిగేట్ల చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమ తీవ్రతను తేలతెల్లం చేస్తున్నదని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణవాదులు మాత్రం ఆకాశంలోనూ తమ నిరసనను ప్రధానికి నిరసన తెలుపుతామని దృఢ నిశ్చయంతో ఉన్నారు. హైదరాబాద్‌లో నల్ల బెలూన్లను ఎగురవేయాలని, వీలైన చోటల్లా నల్ల జెండాలను ఎగురవేయాలని, తెలంగాణవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. నవంబర్‌ 1న మరో సంగ్రామానికి సిద్ధం కావాలని ఆయన కోరారు. నేడు ప్రధాని పర్యటనకు నిరసనగా ఇందిరా పార్క్‌ దగ్గర నిరసన చేపట్టనున్నట్లు ఆయన వివరించారు తెలంగాణ సమస్య పరిష్కారంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, ఆజా’ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఇచ్చిన హావిూలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఈ నెల 16న ప్రధాని పర్యటనకు నిరసనగా నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసనలు తెలపనున్నట్లు కోదండరాం తెలిపారు. అలాగే ఇందిరా పార్కువద్ద నల్లరంగు బెలూన్లు ఎగురవేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు వచ్చే ముందు ప్రత్యేక రాష్ట్రంపై ప్రధాని హావిూ ఇవ్వాలన్నారు. డిసెంబం 9 ప్రకటనను అమలుచేసి కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అయితే అలాంటి పరిస్తఙతి కాంగ్రెస్‌లో కనిపించడం లేదన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయాన్ని కేంద్రం కోరటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నవంబరు 1కి సంబంధించి కీలకమైన కార్యాచరణ రూపొందించుకున్న తర్వాతే స్టీరింస్త్ర కమిటీ భేటీ అవుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తామని ఉభయసభలో ప్రకటించి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 16న రాష్టాన్రికి వస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింస్త్రకు తెలంగాణవాదులు నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ నగార సమితి చైర్మన్‌ నాగం జనార్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో సమితి నేత హరీశ్వంరెడ్డితో కలిసి విూడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాలకు సంబంధించి నగరంలో జరుగుతున్న జీవవైవిధ్య సదస్సులో పాల్గొన ప్రసంగించడానికి ప్రధాని రాకను తాము స్వాగతిస్తున్నామని, గత 55 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే జీవన్మరణ సమస్యగా పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఇటీవల కాలంలో వెయ్యి మందికి పైగా ప్రాణత్యాగం చేశారని, వారి ప్రాణాలు జీవవైవిధ్యం పరిధిలోకి రావాఅని నాగం ప్రశ్నించారు. తెలంగాణాగడ్డపై జరుగుతున్న జీవవైవిధ్య సదస్సులో ప్రధాని తెలంగాణ ప్రజల కోర్కెను అర్ధం చేసుకొని రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రకటన చేయాలని నాగం డిమాాం చేశారు. 16న జరిగే ఈ నిరసన ధర్నాలో టిఆంఎస్‌, బిజెపి, సిపిఐ న్యూడెమోక్రసీ, తెలంగాణ జేఏసి దాని అనుబంధ సంస్థలు, సంఘాలు, ప్రజా సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల తెలంగాణపై ఇచ్చిన లేఖ అస్పష్టంగా ఉందని, స్పష్టమైన లేఖను ఇచ్చిన తర్వాతే ఆయన తెలంగాణలో పాదయాత్రకు అడుగుపెట్టాలని డిమాాం చేశారు.