తెలంగాణకు మోదీ రాకకు ముందు బీజేపీకి మరో షాక్..
టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కార్పోరేటర్..
వరంగల్ ఈస్ట్, జూన్ 01(జనం సాక్షి):
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణపర్యటనకు ముందు బీజేపీ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..నిన్న హైదరాబాద్ లోని పలువురు బీజేపీ కార్పోరేటర్లు టీఆర్ఎస్ లో చేరగా శుక్రవారం ఐటీ పురపాలక మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సమక్షంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆద్వర్యంలో వరంగల్ కు చెందిన బీజేపీ 27 వ డివిజన్ కార్పోరేటర్ చింతాకుల అనీల్,బీజేపీ మాజీ జిల్లా అద్యక్షుడు చింతాకుల సునీల్ టీఆర్ఎస్ లోకి చేరారు..
ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు నచ్చక,తెలంగాణపై మోదీ చూపుతున్న వివక్షకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కే.టీ.ఆర్ నేతృత్వంలోనే తెలంగాణా అభివృద్ది సాద్యమని బీజేపీని వీడి టీఆర్ఎస్ చేరుతున్నట్టు వారు ప్రకటించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎంపీ పసునూరి దయాకర్,ఎమ్మెల్సి బండా ప్రకాష్,మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ టీ.రమేష్ బాబు,టీఆర్ఎస్ నాయకుడు గందె నవీన్,ఇతర నాయకులు పాల్గొన్నారు..