తెలంగాణపై కారుకూతలు కూసిన కావూరి

ఇంటిని చుట్టుముట్టిన తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ
హైదరాబాద్‌: ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఇంటిని తెలంగాణ లాయర్ల జేఎసీ గురువారం ముట్టడించారు. హైదరాబాద్‌ లోని ఎంపీ కావూరి ఇంటి ఎదుట లాయర్లు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని బంజారిహిల్స్‌ పీఎస్‌ కు తరలించారు. ఈ సందర్భంగా టి-లాయర్ల జేఏసీ నేతలు మాట్లడుతూ ఆంధ్రాలో ఎంపీ కావూరి తెలంగాణ సాధ్యం కాదన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. కావూరికి దమ్ముంటే హూదరాబాద్‌ కు వచ్చి ఆ విధమైన వ్యాఖ్యలు చేయాలని వారు సవాల్‌ విసిరారు. తెలంగాణ ప్రాంత భూములను దోచుకొని తెలంగాణలో క్రాంట్రక్టులు చేస్తు ప్రజా ధనాన్ని పందికొక్కుల్లా బొక్కుతున్న ఎంపీ కావూరికి బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని, లేకుంట్‌ ఖబర్దార్‌ అంటూ వారన్నారు. సీమాంధ్ర నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణను ఆపలేరని వారు అన్నారు.