తెలంగాణపై లేఖ ఇచ్చేద్దాం
సీమాంధ్ర నేతలకు బాబు బుజ్జగింపు
అలా అయితేనే తెలంగాణలో టీడీపీని నమ్ముతారు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనంసాక్షి) :
తెలంగాణ అంశాన్ని తేల్చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నడుం బిగిం చారు. ఈ అంశంపై పార్టీ నేతలతో శనివారం నుంచి సంప్రదిం పులు ప్రారంభించారు. అందు బాటులో ఉన్న నేతలతో ఆయన తన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణపై నిర్ణయం తీసుకో వాల్సిన ఆవశ్యకత, అనుకూలంగా తీసుకుంటే కలిగే లాభ నష్టాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, ఇరు ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, పాదయాత్ర, ఢిల్లీ పర్యటన వివరాలపై చర్చ జరిగింది. తెలంగాణకు అనుకూ లంగా లేఖ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఒత్తిడి పెంచాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు లేఖ ఇచ్చే విషయమై సీమాంధ్ర నేతల అభిప్రాయం అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అయితే, సీమాంధ్ర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. సమైక్యాంధ్ర పార్టీ తరఫున గట్టిగా పోరాడామని, ఇప్పుడు వెనక్కు తగ్గితే ప్రజల్లో చులకన అవుతామని వారు అన్నట్లు తెలిసింది. రాష్టాన్న్రి విభజించాలా? వద్దా? అన్నది అధికారంలో ఉన్న పార్టీయేనని, నిర్ణయం తీసుకోవాల్సిన కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించనప్పుడు మనమేందుకు స్పష్టత ఇవ్వాలని అన్నట్లు సమాచారం. అయితే, వారిని బాబు బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మన ం ఇదివరకే తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని బాబు అన్నట్లు తెలిసింది.బాబును కలిసిన సీమాంధ్రకు చెందిన పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కోడెల శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.
తొలుత సోమిరెడ్డి చంద్రమోహన్‌తో బాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా లేక ఇస్తే సీమాంధ్రలో వ్యతిరేకత వస్తుందని, పార్టీ నష్టపోతుందని సోమిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. అయితే, రాష్టాన్రికి, పార్టీకి లబ్ధి చేకూర్చే రీతిలో ఏ నిర్ణయం తీసుకున్నా తాము అంగీకరిస్తామని చెప్పినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: సోమిరెడ్డి
పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సోమిరెడ్డి అన్నారు. బాబుతో భేటీ అనంతరం సోమిరెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గురించి తమ మధ్య చర్చ జరగలేదని చెప్పారు. తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదన్నారు. చంద్రబాబుతో భేటీలో తెలంగాణపై చర్చ జరగలేదన్నారు. ఢిల్లీ పర్యటన వివరాలను బాబు వివరించారని, ఆయన తలపెట్టిన పాదయాత్రపై చర్చించామన్నారు. రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు తెలంగాణపై చర్చించే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, పార్టీ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అంశంపై చర్చిస్తామన్నారు. తెలంగాణపై పార్టీ అధ్యక్షుడు త్వరలోనే స్పష్టత ఇస్తారని చెప్పారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తన వైఖరి వెల్లడించక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే ఆ ప్రాంతంలో చంద్రబాబును అడ్డుకొనే అవకాశముంది కదా? అని ప్రశ్నించగా.. ఆ పరిస్థిత ఉండదనే ఆలోచన నుంచి బయటపడాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా పర్యటించే హక్కు నాయకులకు ఉంటుందని, ఆ హక్కును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు.
సీమాంధ్ర నేతలు ఉద్యమం చేయడం లేదని కేంద్ర మంత్రి వాయలార్ రవి చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మండిపడ్డారు. సమైక్య ఉద్యమాలపై ఆయనకు పూర్తి సమాచారం లేదన్నారు. తెలంగాణ కోసమే రాష్ట్రంలో ఉద్యమాలు జరగడం లేదని, సమైక్య రాష్ట్రం కోసం కూడా సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సంధిగ్ధ పరిస్థితులు కొనసాగడం మంచిది కాదని, ఏదో నిర్ణయం వెంటనే తీసుకోవాలన్నారు.