తెలంగాణపై వివక్ష

3

– ఈటల

న్యూఢిల్లీఫిబ్రవరి 6(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు కేంద్రం నిధుల కొరత విధించిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. అనంతరం ఈటెల విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం అని నినాదమిచ్చిన ప్రధాని మోడీ ఆచరణ మాత్రం అందుకు అనుగుణంగా లేదని మండిపడ్డారు. పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కేంద్రం అండగా ఉండాలన్నారు. తెలంగాణ గ్రోత్‌ రేట్‌ 15 శాతం ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ప్రధాని మోడీ ప్రభుత్వం బడా కంపెనీలకు మేలు చేసేలా వ్యవహరిస్తుందన్నారు. చిన్న తరహా, దేశీయ పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. సీఎస్‌ఎస్‌లను అవసరాలకు అనుగుణంగా వాడుకునే వీలు కల్పించాలని కోరారు. సెజ్‌లలో మ్యాట్‌ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం న్యాయం చేసిందని పేర్కొన్నారు.