తెలంగాణలో కోకాకోలా మరిన్ని పెట్టుబడులు..

` సిద్ధిపేట ప్లాంట్‌కు అదనంగా రూ.647 కోట్లు
` కరీంనగర్‌ లేదా వరంగల్‌లో రెండో తయారీ కేంద్రం
` ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్‌ మేక్‌
` అన్ని రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ : కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పలు కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండగా, ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన పలు కంపెనీలు.. తమ ప్లాంట్లను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. కోకా కోలా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. సిద్దిపేటలోని ప్లాంట్‌ను మరింత విస్తరించాలని కోకా కోలా సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో కొకాకోలా సంస్థ తన ప్రణాళికను తెలియజేసింది. తమ సంస్థకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌ భారత్‌ అని.. ఇక్కడ తమ వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించే వ్యూహంలో ముందుకు పోతున్నామని కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్‌ మేక్‌ గ్రివి తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ఆయన మంత్రి కేటీఆర్‌కి తెలియజేశారు. సిద్దిపేటలోని ప్లాంట్‌ను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. కరీంనగర్‌ లేదా వరంగల్‌ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలియజేసింది. ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్‌ పెట్టుబడితో కలుపుకుంటే తెలంగాణలో కోకాకోలా సంస్థ దాదాపుగా 2500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుందని కోకాకోలా సంస్థ మంత్రి కేటీఆర్‌కు తెలిపింది.
అన్ని రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ : కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకవైపు ఐటీ, ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ అనుబంధ రంగాలే కాకుండా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని అన్నారు. తాజాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ కోకాకోలా తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండో తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు మేక్‌ గ్రీవికి మంత్రి కేటీఆర్‌ హావిూ ఇచ్చారు.
సిద్దిపేట ప్లాంట్‌కు మరో రూ.647 కోట్లు
సంగారెడ్డి జిల్లాలోని అవిూన్‌పూర్‌ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్‌ ప్లాంట్‌ విస్తరణకు గతంలోనే రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామన్నారు. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లా లో రూ.1,000 కోట్లతో నూతన బాటిలింగ్‌ ప్లాంట్‌ నిర్మాణానికి.. ఏప్రిల్‌ నెల 22న తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో రూ.647 కోట్లను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్‌లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్‌ డిసెంబర్‌ 24లోగా పూర్తి అవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కరీంనగర్‌ లేదా వరంగల్‌లో..!
దీంతోపాటు రెండో నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రకటించింది. కరీంనగర్‌ (ఐజీతీతిఎనిజీణజీతీ) లేదా వరంగల్‌ (చిజీతీజీనిణజీశ్రీ) ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్‌ పెట్టుబడితో కలిపి దాదాపుగా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులను.. తెలంగాణలో పెట్టినట్లు అవుతుందని కోకాకోలా సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.
మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు
కోకాకోలా తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండో తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.