తెలంగాణలో త్వరలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ..


రూ.800 కోట్లతో ఏర్పాటు చేసిన మేధ గ్రూప్‌..
` సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి):తెలంగాణలో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం కానుంది. దీని వల్ల వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లా కొడంకల్‌లో మేధ గ్రూప్‌.. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభించనుంది. రెండేళ్లక్రితం రంగారెడ్డి జిల్లా కొడంకల్‌లో మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులను మేధా సంస్థ వేగంగా పూర్తి చేసుకుంది. భారత్‌లో ఉన్న అతి పెద్ద ప్రైవేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలలో ఇది ఒకటి. రూ.800 కోట్లతో రైల్వ్‌ కోచ్‌ ఫ్యాక్టరీని మేధ ఏర్పాటు చేయనుంది. సుమారు 2 వేల మందికి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణ త్వరలోనే రైల్‌ కోచ్‌లను మ్యాన్‌ఫాక్చర్‌ చేసి షిప్పింగ్‌ చేయనుంది. తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నందుకు మేధ యాజమాన్యానికి కృతజ్ఞతలు అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అలాగే.. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ యూనిట్‌ ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

తాజావార్తలు