తెలంగాణలో పుష్కర ఏర్పాట్లు భేష్‌

2

– సీఎం కేసీఆర్‌పై లగడపాటి ప్రశంసలజల్లు

కరీంనగర్‌ 19 జూలై (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ..ఎప్పటికప్పుడ గిల్లికజ్జాలతో తెలంగాణ పై విషం కక్కిన లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణ పై తన వైఖరిని మార్చుకున్నారు. ఆస్తుల పరిరక్షణో, కారణమేదో తెలియదుగాని తెలంగాణ ముఖ్యమంత్రిపై పోగడ్తలతో ముంచెత్తారు.సమైక్య రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడతారని దుష్ప్రచారం చేసిన సమైక రాష్ట్రంలోని రాజకీయ నాయకుడు, అప్పటి ఎంపీయే ఈ లగడపాటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ప్రతిన పూని, చేసిన వాగ్దానం ప్రకారం రాజకీయ సన్యాసం స్వీకరించిన నేత రాజగోపాల్‌. ఏ నోటితోనైతే సీఎం కేసీఆర్‌ను విమర్శించారో ఇవాళ అదే నోటితో కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. పుష్కరాల కోసం సీఎం కేసీఆర్‌ చేసిన ఏర్పాట్లు అద్బుతంగా ఉన్నాయని కొనియాడారు. పుష్కరాల్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం అభినందనీయమన్నారు. ఇవాళ ఆయన జిల్లాలోని కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లలో కుటుంబ సమేతంగా పుణ్య స్నానం ఆచరించారు. కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల కోసం చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయమన్నారు.