తెలంగాణలో పెట్టుబడులకు బోయింగ్‌ సుముఖత

2

– వాషింగ్టన్‌ డీసీ కంపెనీ, ఎన్‌ఆర్‌ఐలతో భేటి

– మిషన్‌ కాకతీయకు ఎన్‌ఆర్‌ఐలు 50 వేల డాలర్ల విరాళం

– ఆకట్టుకుంటున్న కేటీీఆర్‌ అమెరికా  పర్యటన

వాషింగ్టన్‌  మే7(జనంసాక్షి):

ఐటి మరియు పంచాయతిరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు  అమెరికా పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తోలిరోజు వాషింగ్టన్‌ డిసిలో జరిగిన పలు సమావేశాల్లో మంత్రి తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాల విూద ప్రసంగించారు. పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమయ్యారు. వాషింగ్టన్‌ డిసి చేరుకున్న మంత్రి తోలుత        అమెరికాలో భారత రాయబారి  అరుణ్‌ కుమార్‌ సింగ్‌ తో విందు సమావేశంలో పాల్గోన్నారు. యూఎస్‌ భారతదేశం బిజినెస్‌ కౌన్సిల్‌ యూఎస్‌ ఐబిసి సినియర్‌ ప్రతినిధుల నేతృత్వంలో రాయభారిని కలిసిన మంత్రి, తెలంగాణలో గత పదినెలల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అరున్‌ కూమార్‌ సింగ్‌ తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను , ముఖ్యంగా దేశంలో ఏక్కడా లేని విధంగా రూపోందించిన పారిశ్రామిక పాలసీని అభింనందించారు. ముఖ్యమంత్రికి కె.చంద్రశేఖర్‌ రావుకి రాష్ట్ర ప్రగతి పట్ల ఉన్న అలోచనలను అయన అభినందించారు.  భారత రాయభారిని కలిసిన తర్వతా  ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్ధ బోయింగ్‌ అధ్యక్షుడు, మార్క్‌ అలెన్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఏరోస్పేస్‌ పరిశ్రమలు, వాటికున్న మరిన్ని అవకాశాలను మంత్రి కె.తారక రామారావు వివరించారు. తెలంగాణలో ఉన్న ఏరోస్పేస్‌ అవకాశాలపై మంత్రి ఓక ప్రేజేంటేసన్‌ ఇచ్చారు.  తామ బోయింగ్‌ కంపెనీ సైతం భారత దేశంలోని వైమానిక రంగంలో ఉపందుకుంటున్న  ప్రయివేటు పెట్టుబడుల నేపథ్యంలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటుకి అలోచిస్తున్నామని బోయింగ్‌ అద్యక్షుడు అలెన్‌ తెలిపారు. తెలంగాణలో బోయింగ్‌  పెట్టుడులపై చర్చించేందుకు హైదరాబాద్‌ కి తర్వలోనే సంస్ధ సినియర్‌ ప్రతినిధులను పంపేందుకు నిర్ణయించింది.అతర్వతా  ప్రముఖ ఐటి దిగ్గజం హ్యూలెట్‌ ప్యాకర్డ్‌ వైస్‌ ప్రెసిడెండ్‌ సుపర్ణో  బెనర్జీ తో మంత్రి సమావేశమయ్యారు. సంస్ధ ప్రింటర్ల తయారీ కేంద్రాన్ని హైదరాబరాద్‌ లో ఏర్పటు చేయాలని కోరారు. దీంతో పాటు కంపెనీ కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సీబిలిటీ కింద తెలంగాణలో ఓక ట్రౌమా కేర్‌ సేంటర్‌ ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దినికి  హెచ్‌ యాజమాన్యం వేంటనే అంగీకరించింది. తెలంగాణలో ప్రభుత్వ సహకారంలో విద్యా , వైద్యరంగాలతోపాటు ఇతర అనేక రంగాల్లో తమ కంపెనీ ముందు కెళ్లేందుకు సిధ్దంగా ఉందని బేనర్జీ తెలిపారు. వీరితో పాటు ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ, లాక్హీడ్‌ మార్టిన్‌, ఫైజర్‌, విప్రో మరియు మాస్టర్‌ కార్డ్‌ నుంచి సీనియర్‌ ప్రతినిధులు ఐటి మంత్రి కలుసుకున్నారు.  ఏక్‌ లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ ఎవమ్‌ఆర్‌ ర్రీ జోర్గేన్సేన్‌ మంత్రిని  కలిసి  అరు నెలల్లో 200 మంది ఉద్యోగులతో  కరీంనగర్లో , ఒక ఆరోగ్య కెపిఓ, ఎనాలటిక్‌  కంపెనీ ప్రారంభిస్తామన్నారు.సాయంత్రం వాషింగ్టన్‌ డిసి ప్రాంతంలో స్థిరపడ్డ  తెలుగు వారు, వృత్తి నిపుణులు ఏన్నారైలు హజరైన సమావేశంలో ప్రసంగించారు. మంత్రి  కె.తారక రామారావు తెలంగాన డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌, మిషన్‌ కాకతీయ,  గృహనిర్మాణం  వంటి  ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించారు, వారి ప్రభుత్వానికి మద్దతు కోరగా వాషింగ్‌ టన్‌ డిసి ఏన్నారైలు 50వేల అమెరికన్‌ డాలర్ల విరాళాన్ని మిషన్‌ కాకతీయకిచ్చేందుకు ముందుకు వచ్చారు.