తెలంగాణలో భారీ వర్షాలు

2

– రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. పూరీ-గోపాల్‌ పూర్‌ మధ్య తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా విూదుగా పయనిస్తున్న వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లోని పలు జిల్లాల్లో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు సాధారణ స్థాయికంటే 96 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది.ఖమ్మం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాంగులు, వంకలు పొంగి పరలుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి ఉద్ధృతి పెరగడంతో నీటిమట్టం 28 అడుగులకు చేరింది. ఇల్లందు, అశ్వారావ్‌ పేట, మధిరలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇటు బయ్యారం, వైరా చెరువులు అలుగుపారాయి. తాలిపేరు, మూకమామిడి, పెదవాగు ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.ఇటు ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మందమర్రిలోని సింగరేణి రీజియన్‌ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అటు బెల్లంపల్లి రీజియన్‌ లోని శ్రీరాంపూర్‌, శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌, కైరిగూడ? ఓపెన్‌కాస్ట్‌ల్లోకి చేరినన వరదనీరు కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వేమనపల్లి మండలంలో వాగులు పొంగిపొరలుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..ఇక కడెం ప్రాజెక్ట్‌ లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది.కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షాల ధాటికి వాగులు ఉప్పొంగుతున్నాయి. కాటారం మండలంలో పోతులవాగు, మహాముత్తారం మండలంలో పెద్దవాగు, సంగంపల్లి, కనుకూరు వాగులు పొంగి పొరలుతున్నాయి. మహదేవ్‌పూర్‌ మండలంలో పెద్దంపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.వరంగల్‌ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి పాకాల చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. తొర్రూరు మండలం గుర్తూరులో ఆకేరు వాగు, కొత్తగూడలో గాంధీనగర్‌, కొత్తపల్లి వాగులు పొంగి పొరలుతున్నాయి. దుగ్గొండిలో జెర్రిపోతుల వాగు ఉధృతంగా ప్రహవిస్తోంది.నల్లగొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బీబీనగర్‌ మండలం రుద్రవెల్లి, చిన్నరావులపల్లి గ్రామాల్లో మూసీ వాగు పొంగు పొరలుతోంది. ఇటు ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది.