తెలంగాణలో రైతు చరిత్ర
మండుటెండల్లో చెట్టునీడ దక్కితే…ఎడారిలో ఒయాసిస్సు కనిపిస్తే…ఆకలవుతున్న వాడికి పట్టెడన్నం దొరికితే.. ఇంతకన్నా ఇంకేం కావాలి. ప్రపంచానికి అన్నం పెడుతున్న అన్నదాత భుజం తడితే చాలు.. ఇంకా కష్టపడతాడు.. కాయకష్టం చేసి కనీస మద్దతు దరకోసం చూస్తున్న రైతులకు పెట్టుబడి సాయం ఎంతోకొంత అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఇప్పుడదే జరుగుతోంది. రైతును వెన్నుతట్టి ముందుకు నడిపించే మహానాయకుడొకడు తెలంగాణలో కెసిఆర్ రూపంలో వచ్చాడు. జనాభాలో 70శాతం ఉన్న రైతన్నల కష్టాలు తెలిసన నాయకుడిగా నాలుగేళ్లుగా చేస్తున్న ఆలోచనలు, కార్యక్రమాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్న వేళ తెలంగాణ చరిత్రలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. నరా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న సంకల్పంతో తీసుకున్న చర్యలు అన్నీ సాకారం అయ్యేదిశగా సాగుతోంది. రైతన్నలను ఏ విధంగా ఆదుకోవచ్చో ప్రపంచానికి తెలిపేలా చేస్తున్న కార్యక్రమాలు తెలంగాణ చరిత్రను కొత్తగా లిఖించబోతున్నది. కొందరు కారణ జన్ములు ఉంటారు. ప్రజల కోసం నిరంతరం తపించే పాలకులు ఉంటారు. మనం పాలన చేఏది వారికోసమే అని అనుకుంటారు. అందుకు అనుగుణంగా ఆలోచన చేస్తారు. తమ ఆలోచనలు కార్యారూపం దాల్చేలా చేస్తారు. తెలంగాణ కల సాకారం అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. తన ఆలోచనలనకు పదనుపెట్టి ముందుకు నడిచి దానిని సాకారాం చేసిన క్రమంలో తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్దికి బాటలు వేస్తున్న తరుణంలో కెసిఆర్ మదిలో పుట్టిన ఆలోనే రైతుబంధు పథకం. అది గురువారం నుంచి అమల్లోకి వస్తోంది. ఇప్పటికే మిషన్ కాతీయతో చెరువుల పునరుద్దరణ అన్న మహాయజ్ఞం నడుస్తోంది. దీంతో ఎప్పుడూ లేని విధంగా వేలది చెరువులు మళ్లీ జలకళ సంతరించుకున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు రాబోతున్నది. ఇకపోతే నిరంతర విద్యుత్‌తో అటు ప్రజలను, ఇటు రైతులను ఆశ్చార్యానికి గురి చేశారు. అలాగే ప్రాజెక్టులను శరవేగంగా నడిపిస్తూ కృష్ణా,గోదావరి నదులను తెలంగాణ భూములకు చేరేలా చేస్తున్నారు. ఈ దశలో రైతులకు అండగా వారి వ్యవసాయంలో సాయం చేసే పథకం ఆవిష్కృతం కాబోతున్నది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చూడాలన్న కల సాకారం దిశగా ఈ నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటూ ముందుకుసాగుతున్న తీరు అందరినీ అధ్యయనం చేసేలా చేస్తోంది. తొలుత మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో పూడిక తీయించి భూగర్భ జలాల స్థిరీకరణపై దృష్టిపెట్టారు. ఇప్పటికే సుమారు 19వేల చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. బోర్లకింద ఎక్కువ సాగు భూమి ఉన్నందున రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించారు. రైతులకు సాంకేతిక అంశాల్లో అండగా ఉండేలా ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించారు. గోదాంల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టారు. రైతు సమస్యలు ఒక్కొక్కటి గా పరిష్కరిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్.. దేశ వ్యవసాయరంగ చరిత్రలోనే పెను సంచలనమైన రైతుబంధు పథకాన్ని ప్రకటించారు. సాగుపెట్టుబడి కోసం రైతుకు నేరుగా ఎకరానికి రూ.4వేలు ఇస్తామని ప్రకటించగానే యావత్ దేశం దృష్టి ఇటువైపు మళ్ళింది. దేశ రైతాంగం సంబురపడిపోతే.. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదెలా సాధ్యమంటూ తెలంగాణవైపు దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం ఈ వానకాలం పెట్టుబడి కోసం ప్రతి రైతుకు సకాలంలో ఎకరాకు రూ.4వేల సాయం కచ్చితంగా అందనుందన్న భరోసా దక్కబోతోంది. రాష్ట్రంలో వ్యవసాయాభి
వృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు కీలక నిర్ణయాలు ఇప్పుడు ఇతరులకు ఆదర్వం కాబోతున్నాయి. రైతులే తమ పంటకు సరైన ధరను నిర్ణయించు కునేలా గ్రామ రైతుసంఘాల కలయికతో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమాఖ్యల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి రైతులకు భవి/-యత్‌పై భరోసా కల్పించింది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు రైతును ఆదుకునేలా రాష్ట్ర రైతు సమాఖ్యకు బడ్జెట్ కేటాయించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హావిూ ప్రకారం.. రాష్ట్రంలోని దాదాపు 36 లక్షల మంది రైతులకు మేలు చేసేలా రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులను ఏటా పెంచుతూ వస్తున్నారు. అడ్డగోలు ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతోపాటు రైతు పొలానికి ఏ పోషకాలు ఎంత అవసరమో తెలియజేసే అత్యంత ముఖ్యమైన భూసార పరీక్ష కార్డుల పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. భూసార పరీక్షలు చేయించి రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులను అందజేసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ దశలో
కోటీ 40 లక్షల 98 వేల 486 ఎకరాలు! ఎకరానికి రూ.4వేల చొప్పున రూ.5608 కోట్లు! మొత్తంగా 58.06 లక్షల చెక్కులు! రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన వినూత్న, విప్లవాత్మక పథకం రైతుబంధు స్థూల స్వరూపమిది! రాష్ట్ర వ్యవసాయరంగంలో స్వర్ణయుగానికి బాటలు తీస్తూ.. రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మదిలో మెదిలిన అపూర్వ ఆలోచన ఆచరణరూపం దాల్చే క్షణాలు సవిూపిస్తున్న వేళ తెలంగాణ రైతు చరిత్రను లిఖించుకుంటోంది.