తెలంగాణలో వాల్‌మార్ట్‌

3

– మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణలో వాల్‌మార్ట్‌ భారీగా విస్తరణ ప్రణాళికలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్ధ అయిన వాల్‌ మార్ట్‌ ఉపాద్యక్షుడు, లాటిన్‌ అమెరికా అండ్‌ అప్రికా సిఈవో  ఎన్రిక్‌ ఓస్టాలే తో మంత్రి కెటిఆర్‌ సచివాలయంలో సమావేశం అయ్యారు. భారత దేశంలో వాల్‌ మార్ట్‌ విస్తరణ ప్రణాళికలను వివరించిన ఎన్రిక్‌ హైదరాబాద్‌ నగరంలో మరిన్ని వాల్‌ మార్ట్‌ స్టోర్లను తెరవనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే పలు స్ధలాలను ఎంపిక చేసుకున్నామని మంత్రికి తెలియజేశారు. వాల్‌ మార్టు త్వరలోనే తన రిటైల్‌ రంగ సేవలతో పాటు వైద్య, నైపుణ్యా శిక్షణ రంగాల్లోకి భారతదేశంలో సేవలను విస్తరించనున్నట్లు ఏన్రిక్‌ ఓస్తలే తెలిపారు. నగరంలో వాల్‌ మార్ట్‌ విస్తరణని అహ్వనించిన మంత్రి కె.తారక రామరావు ఇందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుండి ఇస్తామన్నారు. ఇక వాల్‌ మార్టు తన మహిళలకోసం కిరాణా దుకాణాలు ప్రారంబించి వారిని పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దేందుకు ఓ కార్యక్రమాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి  ప్రభుత్వంతో ఒక ఎంవోయూని కుదుర్చోనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన హర్టీకల్చర్‌ కార్పోరేషన్‌ ద్వారా కూరగాయలు, పండ్లు సరఫరా చేసేందుకు మరోక ఎంవోయుని సైతం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన సెర్ప్‌  చేపట్టిన కృషి మార్టుల నిర్వహణ, మెళకువల

అభివృద్ది కోసం వాల్‌ మార్టు గ్రూప్‌ తో మరో ఎంవోయు కుదుర్చుకోనున్నట్లు మంత్రి కెటిఆర్‌  సమావేశానంతరం తెలిపారు. మూడు ఎంవోయులను ఈ నెలాఖరు లోపల ఒప్పందాలు పూర్తవుతాయన్నారు. ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పాల్గోన్నారు.

ఇదిలా ఉంటే నూతనంగా మున్సిపల్‌ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన మంత్రి కె.తారకరావుని ఐటి పరిశ్రమ ప్రముఖులు అభినందించారు. సచివాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్చాలు అందించారు. జీహెఛ్‌ఎంసీ ఎన్నికలను వంటి చేత్తో గెలిపించిన మంత్రి నాయకత్వాన్ని సైతం వారు ప్రసంశలందించారు. హైదరాబాద్‌ నగరానికి కొత్త నాయకత్వం దొరికిందని, నగరం సమూలంగా మార్చేందుకు తమ ఐటి పరిశ్రమ తరపున ప్రభుత్వానికి పూర్తిసహకారం అందిస్తామన్నారు. నగరంలో ప్రభుత్వం  చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో తమ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలీటి ద్వారా కొంత భాగసామ్యాన్ని అందిస్తామని మంత్రికి హవిూ ఇచ్చారు. ముఖ్యంగా ఐటి కారిడార్‌ లోని రహదారులు, దుర్గం చెరువు సుందరీకరణ వంటి అంశాల్లో ప్రభుత్వానిక పూర్తి మద్దతు ఇస్తామని వారు మంత్రి తెలిపారు.

తెలంగాణలో పెట్టుబడులకు నార్వే ఆసక్తి:కెటిఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నార్వే సిద్ధంగా ఉందని ఆ దేశ రాయబారి నిల్స్‌ రాగ్నర్‌ స్పష్టం చేశారు. మంగలవారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో నార్వే ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని నార్వే బృందాన్ని కేటీఆర్‌ కోరారు. రైల్వేలు, చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన అంశాలపై బృందం ఆసక్తి చూపింది. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైనదని మంత్రి కేటీఆర్‌ వారితో అన్నారు. స్కైవేల నిర్మాణం, మూసీ నది ప్రక్షాళనతో పాటు చెరువుల పునరుద్ధరణపై నార్వే బృందం ఆసక్తి చూపిందని అన్నారు. తాజాగా వాల్మార్ట్‌ తో తెలంగాణ ప్రభుత్వం మూడు ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. మున్సిపల్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌ను  మంగళవారం ఐటీ పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నగరాభివృద్ధికి చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ భాగస్వామ్యం అందిస్తామని ఆయనకు ఐటీ ప్రముఖులు హావిూ ఇచ్చారు. మరో మంత్రి జగదీష్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. విద్యుత్‌ శాఖతో పాటు ఎస్సీ కార్పొరేషన్‌ను  ఆయనకు కేటాయిస్తూ మంగళవారం జీవో చేశారు.