తెలంగాణలో విజృభించిన భానుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం 42 డిగ్రీలు, ఆదిలాబాద్‌, మన్మకొండ, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండలో 41 డిగ్రీలు, భద్రాచలంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.