తెలంగాణలో విద్యుత్ వెలుగులకు.. కారణం సోనియానే
– కేసీఆర్ చెప్పిందొకటి.. చేసింది మరొకటి
– కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది
అందుకే ఊరూరా తిరుగుతున్నారు
– కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
కరీంనగర్,నవంబర్27(జనంసాక్షి): దొరల పెత్తనాన్ని ఎదిరించినవారికి… టీఆర్‌ఎస్‌లో టికెట్లు ఇవ్వలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. బోడిగె శోభ, కొండా సురేఖ లాంటి వారికి టిక్కెట్లు ఇవ్వకుండా వారిని అవమాన పరచారని అన్నారు. అలాగే డిప్యూటి సిఎంగా ఉన్న తాటికొండ రాజయ్యను అవమానకంగా మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కేసీఆర్ గత ఎన్నికల హావిూలను పూర్తిగా విస్మరించారన్నారు. దోచుకోవడానికే ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్ చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అవినీతి మూటలతో ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రీజడిజైనింగ్ పేరుతో కమిషన్ మెక్కి ఆ డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి వారికి తగిన బదుద్‌ఇ చెప్పాలని పిలుపునిచ్చారు. మిగులు బ్జడెట్ ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని, టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్టే నని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కుటుంబపాలను పాతరేయాలన్నారు.
తెలంగాణలో విద్యుత్తు వెలుగులకు కారణం సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం తప్ప కేసీఆర్ పాలన కాదని రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస అభ్యర్థులు కవిూషన్లు, భూ కబ్జాలకు పాల్పడేవారేనన్నారు. కేసీఆర్ తన బంధువులకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయం పాటిస్తారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయ్యాకే విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు మాట్లాడుతున్నారని.. గత ఉత్పత్తికి అదనంగా ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులే ఉత్పత్తి ప్రారంభించాయని ఆయన స్పష్టంచేశారు. దేశంలో ఎక్కడా లేని ధరకు కేసీఆర్ విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం పదవి కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులే పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. 103, 106 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, అట్లయితే రోజుకు ఎనిమిది సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఓడిపోతామని తెలిసే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ఇంటింటికీ తిరుగుతున్నారన్నారు. గెలిచే దమ్ముంటే హాయిగా ఇంట్లో పడుకోవచ్చు కదా అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హావిూ ఏమైందని నిలదీశారు. మిషన్ భగీరథ కాస్త కవిూషన్ భగీరథగా మార్చారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు, ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిందొకటి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసింది మరొకటి అని మండిపడ్డారు. ఆయన ఉద్యమకాలంలో చెప్పిన పనులు చేసి ఉంటే, ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చి ఉంటే ఈ రోజు అవే చెప్పుకొనేవాళ్లన్నారు. చెప్పని పనులు చేశామని అంటున్నారని, అందులో కెటిఆర్‌కు, మరీస్ రావుకు మంత్రి పదవులు ఇచ్చారని, బిడ్డ కవితకు ఎంపి పదవి కట్టబెట్టారని, బంధువులకు కవిూషన్లతో పనులు కట్టబెట్టారని, సంతోష్‌కు రాజ్యసభ ఇచ్చారని ఎద్దేవా చేశారు.