తెలంగాణవాదులను అరెస్ట్ చేయడంతో ఉద్యమం ఆగదు : దాసరి మనోహరరెడ్డి
పెద్దపల్లి, జూలై 22 (జనంసాక్షి) : తెలంగాణ వాదులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని దాసరి మనోహరరెడ్డి పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో అన్నారు. ఆదివారం సాయత్రం ఎస్సై రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద మనోహరరెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన మాట్లాడుతు నేడు సిరిసిల్లకు వస్తున్న వైఎస్సార్ పార్టీ విజయమ్మను తెలంగాణపై అభిప్రాయం ఎంటో చెప్పాలని అడగటం తప్పా అన్నారు. ఈ ప్రభుత్వం దొంగ చాటున పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదన్నారు. నేడు జరగబోయే కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకుం టామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ సమస్య తెలంగాణలో గత 12 సంవత్స రాలనుంచి ఉద్యమం జరుగుతువదని ఈ ఉద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను బలి గొన్నారన్నారు. కొమురయ్య, రాజ్‌కుమార్, సతీష్ గౌడ్, కొలిపాక శ్రీనివాస్, అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.