తెలంగాణాలో రైతుసంక్షేమం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక
సిఎం కెసిఆర్ పాలనానుభవంతో ముందుకు
విమర్శలు చేసేవారు గ్రామాల్లో రైతులను కలవాలి: పోచారం
నిజామాబాద్,జూన్7(జనం సాక్షి): ముఖ్యమంత్రి తన అపార పాలనానుభవంతో రైతు సమస్యలపరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారని వ్వయసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివసా రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించే దిశగా తెలంగాణ రాష్ట్రం సాగుతోందన్నారు. ప్రాజెక్టులతో నీరందించడం, నిరంతర విద్యుత్ కొనసాగించడం, సకాలంలో ఎరువులు పురుగుమందులు అందుబాటులో ఉంచడం, పెట్టుబడి సాయం కింద 8వేలు ఇవ్వడం, రైతులకు బీమా కల్పించడం వంటి చర్యలు రైతులను శాశ్వతంగా కష్టాల నుంచి దూరం చేసేవిగా ఉన్నాయన్నారు. ఇవన్నీ ఉపయోగించుకుని రైతులు బంగారు పంటలు పండిస్తే తెలంగాణ రైతులకు ఢోకా ఉండదన్నారు.ఇప్పటివరకు రైతుబంధు కింద 44 లక్షల చెక్కుల ద్వారా రైతులు సుమారు రూ.4వేల కోట్లు బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారన్నారు. భూదస్త్రాల ప్రక్షాళన కోసం ఇప్పటివరకు వివిధ రకాల కారణాలతో ఆధార్‌కార్డులు లింకు చేయని రైతుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పైచీలుకు ఉందన్నారు. ఇప్పటివరకు రైతుబంధు కింద తమకు వచ్చిన మొత్తాల్లో సుమారు రూ.2కోట్ల వరకు రైతు సమన్వయ సమితికి తిరిగి ఇచ్చారన్నారు. అయితే ఇవన్నీ గమనించకుండా కాంగ్రెస్,టిడిపి తదితర పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. విమర్శలు చేసే వారు గ్రామాలకు వచ్చి రైతులతో మాట్లాడాలని అన్నారు. దేశంలో మొదటి సారిగా రైతులకు జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులు పంట సాగు చేస్తున్నారని, వారిలో 18 నుంచి 60 ఏళ్ల లోపు ప్రతి ఒక్కరికి బీమా వర్తిస్తుందన్నారు. భూ దస్త్రాల ప్రక్షాళన, రైతుబంధు పథకం ఇతర సంక్షేమ పథకాలతో ఇతర రాష్టాల్ర కంటే ముందు దూసుకు పోతున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు విడ్డూరంగా మాట్లాడటం సరికాదన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల రైతులు కూడా తమకు ఇలాంటి పథకాలు రావాలని కోరకుంటున్నారని అన్నారు. అలాంటి డిమాండ్‌తో ఆయా రాష్ట్‌ఆరల్లో ఉద్యమాలు వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు.