తెలంగాణా ప్రజలు రిజెక్ట్ చేసిన పార్టీ టీడీపి
-ఆంద్రానుంచి డబ్బులు తెస్తూ లెక్కలు చూపేందుకు విమర్శలు
-రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణా నంబర్ వన్
-రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
కరీంనగర్, సెప్టెంబర్ 4 (జనంసాక్షి):తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు మూడున్నర సంవ త్సరాలుగా అనేక ప్రజలకు భరోసానిచ్చే కార్యక్రమాలతో ముందుకు వెల్తుందని ఏగ్రామా నికి వెల్లినా రాజకీయాలకతీతంగా ప్రభుత్వ పలాలను అందిస్తున్నదనే నమ్మకాన్ని ప్రజల లో కలిగించామని రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించా రు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి వసతి గృహంలో విూడియాతో మాట్లాడుతూ తెలంగా ణా రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 57 ఏల్ల కాలంలో వ్యవసాయానికి ప్రాధాన్యత నివ్వ కుండా నిర్లక్ష్యం చేయడంతో వందల వేల ఆత్మహత్యలు కోనసాగాయన్నారు. వ్యవసాయం విశ్వాసం కల్పించేందుకుగాను ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. గోదావరి నదిపైన మానవ ప్రయత్నంగా మూడు బరాదులు ఏకకాలంలో ప్రారంభించడమేకాక సంవత్సరం న్నరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో సిసి కెమరాలను బిగించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంతో అనుసందానం చేస్తూ రోజురోజుకు పురోగతిని సవిూక్షిస్తున్నామన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు రెండు పంటలకు 8వేల రూపాయలను పెట్టుబడిగా ఇవ్వనున్నామన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారిగా సమన్వయ సమితిలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలువనున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణా ప్రజలు రిజెక్ట్ చేసిన పార్టీఅని, ఆంద్రా నాయకుల మోకాల్లపై పడి నిధులు తెచ్చుకుంటూ కాలం వెల్లదీస్తు నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.