తెలంగాణా సమాజానికి ప్రశ్నించడం నేర్పిన ఘనత చాకలి ఐలమ్మ దే
– పిల్లుట్ల శ్రీనివాస్ హుజూర్ నగర్, సెప్టెంబర్ 10 (జనం సాక్షి): తెలంగాణా సమాజానికి ప్రశ్నించడం నేర్పిన ఘనత చాకలి ఐలమ్మ దేనని రాష్ట్ర ఈ సి మెంబెర్, బి ఎస్ పి జిల్లా ఇంచార్జి పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం హుజుర్ నగర్ పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ అధ్యక్షతన చాకలి ఐలమ్మ137 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఈ సి మెంబెర్, బి ఎస్ పి జిల్లా ఇంచార్జి పిల్లుట్ల శ్రీనివాస్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పిల్లుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సమజాన్ని తట్టి లేపడంతో పాటు ప్రశ్నించడం అనే విషయాన్ని ఇక్కడి ప్రజలకు నేర్పిన ఘనత వీర వనిత చాకలి ఐలమ్మదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి జిల్లా ఇంచార్జి దాసరి శ్రీనివాస్ యాదవ్, దక్షిణ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కో ఆర్డినేటర్ అమరవరపు అభ్రహం, జిల్లా అధ్యక్షులు చడపంగు రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షలు బొల్లికొండ వీరస్వామి, ప్రధాన కార్యదర్శి బుడిగ మల్లేష్ యాదవ్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపంగు ఉపేందర్, నియోజకవర్గ అధ్యక్షులు కొండమిది నర్సింహారావు, ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గుండెపంగ రమేష్, బాలరాజు, బి ఎస్ పి సోషల్ మీడియా అధ్యక్షులు గందమళ్ళ విరాంజనేయలు, నియోజకవర్గ ఈ సి మెంబెర్ అమరవరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.