తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరికి హరీశ్‌ వినతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్ట్‌ లకు సహకరించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ని కోరిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, ఎంపీ జితెందర్‌ రెడ్డిఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు. హరీష్‌ రావు గురువారం ఉదయం కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నితిన్‌ గడ్కరీ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగిరథ పథకాలను గురించి రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టులకు కావాల్సిన పలు శాఖల అనుమతులు, నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సహకరించాలని కోరామని మంత్రి తెలిపారు. పలు ప్రాజెక్ట్‌ లకు రావాల్సిన బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అతి త్వరలోనే జల వనరుల శాఖ ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ సభ్యులు ఏ.పి. జితెందర్‌ రెడ్డి కేంద్ర జల వనరుల, ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కి మహబూబ్‌ నగర్‌ కు చెందిన పలు రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి విజా&ఙపన పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా మహబూబ్‌ నగర్‌ విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ జడ్చర్ల – మహబూబ్‌ నగర్‌ వరకు నాలుగు లైన్ల రోడ్ల పనులపై హామి ఇచ్చారని ఈ సందర్భంగా ఎంపి జితెందర్‌ రెడ్డి తెలిపారు. కాగా, జడ్చర్ల – మహబూబ్‌ నగర్‌ నాలుగు లైన్ల పనులకు నిధులను మంజూరు చేయాలని కోరామని ఎంపి జితెందర్‌ పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల, ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తో పాటూ పార్లమెంట్‌ సభ్యులు జితెందర్‌ రెడ్డి పాల్గొన్నారు.