తెలంగాణ అసెంబ్లీలో ‘ఫీజు’ రగడ

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు చెల్లింపుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
మెరుగైన నాణ్యతా ప్రమాణాలు పాటింపజేసే క్రమంలోనే కొన్ని కాలేజీల అనుమతులు రద్దయ్యాయని, విద్యా ప్రమాణాల్లో ప్రభుత్వం రాజీపడబోదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కలుగజేసుకొని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. ప్రభుత్వ తీరును నిరిసిస్తూ బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.