తెలంగాణ అసైన్డ్ భూముల యజమానుల హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొడకంచి, మాదారం గ్రామాలలో అవగాహన సదస్సు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని మాదారం  గ్రామపంచాయతీ మరియు కొడకంచి గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో అసైన్డ్ భూములు మరియు ఏ ఇతర లావని పట్టాలు అయినను వాటిపైన గ్రామ ప్రజల సమక్షంలో  అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రుద్రారం శంకర్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి భూమి లబ్ధిదారు ఇంటి నుండి ఇద్దరు చొప్పున ముందుకు వచ్చి కలెక్టరేట్లో, ఆర్డీవో, ఎంఆర్ఓ, కార్యాలయంలో వినతిపత్రాలు ఇచ్చుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దానికి గాను మనమందరం కలిసి మెలిసి ఉంటే ఎంతటి కార్యక్రమాన్ని అయినా విజయవంతంగా సాధించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం ఆ ఇరువురి గ్రామాల్లో అసైన్డ్ భూముల గ్రామ కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదారం సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, కొడకంచి సర్పంచి శివరాజ్, ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు, ఎన్ఎస్ డేవిడ్, ఎం.రాజ్ కుమార్, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు