ఆగిన చక్రాలు!ఆగిన చక్రాలు!

 తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న బంద్‌

ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

– మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె
– పలు రాష్ట్రాల్లో రోడ్డెక్కని బస్సులు, ఆటోలు, క్యాబ్‌
– తెలంగాణలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
– ఏపీలో రోడ్లెక్కిన బస్సులు, పాక్షికంగా బంద్‌
– ఎన్నికల నేపథ్యంలో సమ్మెకు దూరంగా యూనియన్‌లు
– తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో తిరిగిన ఆటోలు
– అధిక చార్జీలతో ప్రయాణీకుల జేబులను గుల్లచేసిన ఆటోవాలాలు
న్యూఢిల్లీ,ఆగస్టు7(జ‌నంసాక్షి): కేంద్రం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజారవాణా సంస్థలు చేపట్టిన బంద్‌ పలు రాష్ట్రాల్లో విజయవంతంకాగా, పలు రాష్ట్రాల్లో పాక్షికంగా సాగింది. హర్యానా రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఒక రోజు బంద్‌లో పాల్గొన్నారు. పంచకుల బస్‌ స్టాండ్‌లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రైవేటు బస్సులను కూడా ఆర్టీసీలో కలపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. కేరళలోనూ ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. కేఎస్‌ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. రవాణా బిల్లును వ్యతిరేకిస్తూ కేరళ ఆర్టీసీ కార్మికులు 24 గంటల బంద్‌ను పాటిస్తున్నారు. వీధుల్లో బస్సులు లేక జనం ఇబ్బందులు పడ్డారు.తెలంగాణలో బంద్‌ సాగింది. మంగళవారం ఒక్కరోజు సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలోని అన్నిప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, మిగిలిన జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్‌ సాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఏడు డిపోల పరిధిలోని 760 ప్రభుత్వ, ప్రయివేట్‌ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం 3వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. మోటార్‌ వెహికిల్‌ సవరణలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేలా కుట్ర చేస్తుందని యూనియన్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈచట్టం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ బంద్‌ జరిగింది. మూడు జిల్లాల పరిధిలో 29 డిపోలకు చెందిన 3,805 బస్సులు ఉదయం నుంచి డిపోలకే పరిమితం అయ్యాయి. అదేవిధంగా 1.10లక్షల ఆటోలు, 40వేల క్యాబ్‌లు నిలిచిపోయాయి. దీంతో అత్యవసర ప్రయాణాలు సాగించేవారు సొంత వాహనాలతో రోడ్డెక్కక తప్పలేదు. పలువురు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరో వైపు పలువురు ఆటోవాలాలు బంద్‌ ఉన్నప్పటికీ రవాణా సాగించి అధికార ఛార్జీలతో ప్రయాణీకులను నిలువుదోపిడీ చేశారు. తెలంగాణలో అన్ని యూనియన్‌లను కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌ లో వాహనాలు లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, సికింద్రాబాద్‌ బస్టాండ్‌ లలో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో రహణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. ఇదే అదునుగా భావించిన ప్రయివేటు వాహనాలు ఇష్టారీతిలో రేట్లు పెంచి దోచుకుంటున్నాయి. బంద్‌ కు సంఘీభావంగా సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం వద్ద రైల్వే కార్మికులు బహిరంగ
సభను నిర్వహించారు. 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్ర నుంచి ఇందిరా పార్క్‌ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించి, అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ  కొత్త మోటారు వాహన సవరణ బిల్లు -2016 ప్రకారం.. ప్రైవేట్‌ వారు ప్రయాణ మార్గానలు కనుక్కోవచ్చు. అంటే లాభాలొచ్చే.. బిజీగా ఉండే రూట్లను ఏ ప్రైవేట్‌ కంపెనీ వారు కొనుక్కున్నా ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు కనిపించకూడదనే కుట్రలో భాగంగానే చట్టాన్ని తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే టోల్‌గేట్ల నుంచి ఆర్టీసీకి మినహాయింపు, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ తగ్గింపు, కార్మికుల కనీస వేతనం రూ. 24వేలు, డీజిల్‌, పెట్రోల్‌పై అదనపు సుంకాలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే  ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మంగళవారం  మధ్యాహ్నం 12 గంటలకు కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు బయల్దేరింది. మళ్లీ సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి కాజీపేటకు రైలు వెళ్లనుంది.

టించాయి.