తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బయ్యారం రామాలయం ఆలయ ప్రాంగణంలో రావి చెట్టును నాటిన బీసీ జనసభ సంఘం కమిటీ*

బయ్యారం,జూన్ 02(జనంసాక్షి):
జూన్ 02 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా మహబూబాబాద్ జిల్లా బీసీ జనసభ సంఘం ఆధ్వర్యంలో బయ్యారంలోని రామాలయం ఆలయ ప్రాంగణంలో రావి చెట్టును నాటారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు చల్లా గోవర్ధన్ మాట్లాడుతూ..బీసీ జనసభ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ సందర్బంగా రాష్ట్రం పచ్చగా ఉండాలనే సదుద్దేశంతో రావి చెట్టును నాటామని తెలిపారు.తెలంగాణ లో విద్య, వైద్యం క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని బీసీ జనసభ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరారు.బీసీ జనసభ మండల అధ్యక్షులు కొదుమూరి విజయ్ మాట్లాడుతూ…బీసీ జనసభ సంఘం తరఫున మండల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.బీసీ జనసభ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.బీసీ జనసభ కన్వీనర్ ఎస్డి మౌలానా మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన బంగారు తెలంగాణ దిశగా అడుగులువేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూలకంటి సీతారాంరెడ్డి,మధుకర్ రాజు,కొమిరె జనార్దన్,ఉపేందర్ రెడ్డి,రామాలయం పూజారి వీర బ్రహ్మచార్యులు,పగడాల రామారావు, భూక్యా నరేందర్,బీసీ జనసభ జిల్లా అధ్యక్షులు చల్లా గోవర్ధన్, బీసీ జనసభ మండల అధ్యక్షులు కొదుమూరి విజయ్,బీసీ జనసభ యూత్ అధ్యక్షులు శెట్టి థామస్,బీసీ జనసభ కన్వీనర్ ఎస్ డి మౌలానా,నాగన్న తదితరులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు