తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేయండి

4

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌

హైదరాబాద్‌,జులై16(జనంసాక్షి):

ఏపీలో ఉన్న తెలంగాణ స్థానికత కలిగిన 121 మంది ఉద్యోగులను తక్షణమే రిలీవ్‌ చేయాలని కమల్‌నాథన్‌ను తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ కోదండరాం కోరారు. ఉద్యోగుల విభజన అంశానికి సంబంధించి కమల్‌ నాథన్‌తో కోదండరాం, దేవీప్రసాద్‌, రవీందర్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోదండరాం అన్నారు. ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలోనే ఉండాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటుందని దేవీప్రసాద్‌ ఆరోపించారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల కోసం ఉద్యమానికి కూడా వెనకాడబోమని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై ప్రభుత్వంతో చర్చిస్తామని కోదండరాం తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై త్వరలో స్పందిస్తానని తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రభుత్వం, పురపాలక కార్మికుల మధ్య విభేదం చిన్నపాటిదేనని.ఈ సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు.