తెలంగాణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చు
హైదరాబాద్:వచ్చే 24 గంటల్లో తెలంగాణ,కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు,రాయలసీమలో జల్లులు కురిసే ఆవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు.నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా పరిస్థితులు ఉండడంతో వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు.విదర్బనుంచి తెలంగాణను అనుకుని ఉపరితల ఆవర్తనం ఉండడం ఒరిస్సా దక్షిణ తమిళనాడుల మధ్య భూతల ద్రోణి ఏర్పడటంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.ఉత్తర బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అంకాశం ఉన్నందున మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుఆ్తయని నిపుణలు చెప్తున్నారు.