తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని సోమవారం స్థానిక బంజారా భవన్ లో డి.బిక్షం నాయక్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ సంఘ బలోపేతానికి తప్పనిసరిగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.మండల కమిటీ ఎన్నికలను కూడా నిర్వహించాలని అన్నారు.ఉపాధ్యాయ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లను చేపట్టడంతో పాటు ఉద్యోగులకు రావలసిన డిఏలు వెంటనే ఇవ్వాలని కోరారు. 317 జిఓ లోపాలను సవరించి ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని వెంటనే పరిష్కరించాలన్నారు.స్పౌజ్ ఉపాధ్యాయులను వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు వస్త్రం నాయక్, నాయకులు జగ్గు నాయక్ , బాలాజీ నాయక్, గౌతమ్ నాయక్ , రఘునాయక్ , రామా నాయక్, బగులాల్, వీరన్న , లింగ , రాములు , బాబు నాయక్ , పాండు నాయక్ , వెంకన్న , శంకర్ , దశరథ , రాములు, బద్రు, రమేష్, రామకృష్ణ , వెంకటేశ్వర్లు, బావు సింగ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం సంఘ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా బానోతు రామానాయక్ , ప్రధాన కార్యదర్శిగా కొర్ర బగ్గులా నాయక్, ఉపాధ్యక్షులుగా లాలు నాయక్, రాములు నాయక్ ను ఎన్నుకున్నారు.