తెలంగాణ దళితులు
ఆర్థిక ఎదుగుదలే సీఎం కేసీఆర్ లక్ష్యం…
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్…
శంకరపట్నo జనం సాక్షి సెప్టెంబర్ 9
దళిత కుటుంబాల ఆర్థిక ఎదుగుదల కోసం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ. తెలంగాణలో దేశంలో మరెక్కడ లేని విధంగా, దళిత కుటుంబాల ఆర్థిక ఎదుగుదల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, దళిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దళిత బంధు పొందిన కుటుంబాల్లో అనుకొని, ఘటనలు జరిగినచో ఆ కుటుంబానికి అండగా దళిత రక్షణ నిధి నుండి ప్రభుత్వమే ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి దళిత బంధు పథకం ద్వారా దళితులకు పది లక్షల రూపాయల ను అందజేసి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.