తెలంగాణ ధిక్కార పతాక చాకలి ఐలమ్మ

 తెడ్ల  ధనుంజయ
మిర్యాలగూడ. జనం సాక్షి
 తెలంగాణ పేరును చరిత్ర పటంలో ఉన్నత స్థానానికి చేర్చిన ఘనత తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి దక్కుతుందని స్థానిక విజేత డిగ్రీ కళాశాల  ప్రిన్సిపల్  తెడ్ల ధనుంజయ అన్నారు. సోమవారం  చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా  కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం అయన మాట్లాడుతూ నిజాం నవాబుల కాలంలో భూస్వామి అయిన  విసునూరు రామచంద్రారెడ్డి  కి వ్యతిరేకంగా నిరక్షరాస్యులయిన  చాకలి ఐలమ్మ సంఘ సభ్యుల సహకారంతో దిక్కార స్వరాన్ని   వినిపించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక మైలురాయి గా నిలిచి పోయారన్నారు. చదువు, ఎలాంటి సాంకేతిక  సదుపాయాలు లేని ఆ రోజుల్లో  మహిళకు అనేక రకాల కట్టుబాట్లు ఉన్నప్పటికీ  వాటన్నిటిని దాటుకుని  తన హక్కులకై ప్రాణాలు సైతం లెక్కచేయని దీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. అటువంటి దీరవనితను ఆదర్శంగా తీసుకొని అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ సమాజాన్ని ఉపయోగించుకుంటూ విద్యార్థినిలు,మహిళలు  మరింత అభివృద్ధి చెందాలని మహిళలు ఎంత అభివృద్ధి చెందితే  సమాజం అంత బాగుపడుతుందని  ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో విజేత డిగ్రీ పీజీ కళాశాల సిబ్బంది మరియు పారామెడికల్ కళాశాల  ప్రిన్సిపల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Attachments area