*తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ క్షమాపణ చెప్పాలి!

*బిజెపి నాయకుల నల్లబ్యాడ్జీలతో నిరసన
_________________________
లింగంపేట్ 18 సెప్టెంబర్ (జనంసాక్షి)
 రజాకార్లతో పోరాడి వీర మరణం పొందిన మహనీయుల చరిత్రను కనుమరుగు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదివారం నల్ల బ్యాడ్జీలతో బిజెపి నాయకులు నిరసన తెలిపారు.లింగంపేట్ మండల కేంద్రంలోని బిజేపి పార్టీ కార్యలయంలో భారతీ జనతా పార్టీ రాష్ట శాఖ పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టి నట్టు బిజెపి మండల అధ్యక్షుడు దత్తు రాములు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రజాకార్లతో పోరాడి అసువులు బాసిన బద్దం ఎల్లారెడ్డి,చాకలి ఐలమ్మ,రావి నారాయణరెడ్డి,దొడ్డి కొమురయ్య లాంటి వీరులు 4,500 మంది పోరాటంలో వీరమరణం పొందితే ప్రజలకు ఈ విషయము తెలియ చేయకుండా ఎంఐఎం పార్టీ కి భయపడి స్వాతంత్ర సమర యోధులను విస్మరించి శాసనసభలో ప్రస్తావించకుండా శనివారం హైదరాబాద్ లో జరిగిన సభలో తెలంగాణ సమాజాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి తీరుపై వారుమండి పడ్డారు.ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినం వారి నోటనే తెలియ జేస్తు తెలంగాణ ప్రజలకు క్షమాపన చెప్పాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహారాజుల మురళి,ఆముదాల ఉదయ్ కుమార్,కోల అల్లూరి,బాలరాజు పాల్గొన్నారు.
Attachments area